News February 4, 2026
HIVతో ఐదేళ్లలో 44వేల మంది బలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది HIV బాధితులు మరణించారని వెల్లడించారు. ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దీనికి కారణమని తెలుస్తోంది.
Similar News
News February 20, 2026
ఖమ్మం: భట్టికి రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మించనున్నారు. ఖమ్మం పట్టణంలో డిప్యూటీ సీఎం కోసం ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మించనున్నారు. భట్టికి ఇది రెండో క్యాంప్ ఆఫీస్ కానుంది. ప్రస్తుతం భట్టి ప్రగతి భవన్‌ను క్యాంప్ ఆఫీస్, నివాసంగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన నిధులు, పరిపాలన అనుమతి ప్రభుత్వం ఇచ్చినందున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టనుంది.
News February 20, 2026
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏక సభ్య కమిషన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించింది. ఈ కమిషన్ టీటీడీలో పరిపాలనా లోపాలు, టెండర్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
News February 20, 2026
ఐటీ రైడ్‌లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

బాలీవుడ్ సినిమా ‘రైడ్’ తరహా ఘటన రాజస్థాన్‌లో జరిగింది. కన్హా గ్రూప్‌పై రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు 6 నగరాల్లో 3 రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఓ చోట సీక్రెట్ రూమ్ బయటపడింది. దాన్ని బద్దలుకొట్టి చూడగా రూ.కోట్ల విలువైన గోల్డ్ కనిపించింది. దాని విలువ ఎంత అనేది త్వరలో వెల్లడికానుంది. ఇప్పటి వరకు ₹50L నగదు, 10 బ్యాంక్ లాకర్లు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.


