News January 29, 2026

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA(ఫైనాన్స్, ఆపరేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), బీఫార్మసీ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. అసిస్టెంట్ మేనేజర్‌కు 37ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com

Similar News

News February 16, 2026

జామలో గజ్జి తెగులును ఎలా నివారించాలి?

image

జామ పంటలో గజ్జి తెగులు ప్రధానంగా పచ్చి కాయలపై కనిపిస్తుంది. దీని వల్ల కాయలపై చిన్నచిన్న తుప్పు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగా పెరగకుండా రాలిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగులును నివారించడానికి లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్‌ 4 గ్రాముల కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 16, 2026

మహిళలు హనుమంతుడి పాదాలు తాకకూడదా?

image

‘హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచర్య నియమాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతో మహిళలు స్వామివారి పాదాలను తాకకూడదు’ అని పండితులు సూచిస్తున్నారు. భక్తికి లింగభేదం లేదని చెబుతున్నారు. ‘మహిళలు హనుమాన్ చాలీసా పఠించవచ్చు. కఠిన ఉపవాసాలు ఉండవచ్చు. సీతాదేవిని తల్లిగా గౌరవించిన హనుమంతుని పట్ల మహిళలు చూపించే నిష్కల్మషమైన భక్తి, మానసిక ఆరాధన అత్యంత పుణ్యప్రద ఫలితాలను ఇస్తాయి’ అని చెబుతున్నారు.

News February 16, 2026

భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

image

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.