News August 9, 2024

HMDAలోకి మన ఉమ్మడి మెదక్

image

HMDAలో కొత్తగా 2 <<13811034>>జోన్లు<<>> పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు కలిశాయి. మేడ్చల్-1 జోన్‌లో నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, మనోహరాబాద్, మేడ్చల్-2లో ములుగు, వర్గల్, శంకర్‌ప్లలి-1లో రామచంద్రాపురం, శంకర్‌ప్లలి-2లో అమీన్‌పూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర ఉన్నాయి. త్వరలో RRR మొత్తం HMDA పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Similar News

News December 23, 2025

రేపు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన

image

రేపు మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంట మండల కేంద్రంలో గల రైతు వేదికలో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

News December 23, 2025

మెదక్: ‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.6.46 కోట్లు జమ’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 509 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లోనే రూ.6.46 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. 4,529 మంది లబ్ది దారులకు ఇప్పటికే సుమారుగా రూ.90 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్ పీడీ మాట్లాడారు.

News December 23, 2025

కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో డిఫెన్స్‌లోకి రేవంత్ సర్కార్: హరీశ్ రావు

image

తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నారు. పేదల సమస్యలు వదిలి షోలు, సమ్మిట్‌లతో కాలం గడుపుతోందని ఆరోపించారు. కో ఆపరేటివ్ ఎన్నికలు తప్పించుకుంటూ భయంతో పాలన సాగుతోందన్నారు.