News March 14, 2025

HMDA పరిధిలోకి నల్గొండ ప్రాంతాలు

image

హెచ్ఎండీఏ పరిధి విస్తరణను తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి.. ఈ మూడు మండలాలలోని 11 గ్రామాలను కలిపారు.

Similar News

News March 14, 2025

NLG: ఇది ప్రకృతి హోలీ

image

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్‌లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.

News March 14, 2025

మఠంపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

image

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు శుక్రవారం అంబారాన్నంటాయి. ఈ మేరకు ఉదయం నుంచే యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు రంగులు పూసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం హోలీ.. హోలీ.. హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.

News March 14, 2025

మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో జరిగింది. ఎస్ఐ వివరాలు.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకి చెందిన సైదులు(60) శ్రీనివాసనగర్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కోదాడ- జడ్చర్ల రాహదారిని దాడుతున్నాడు. ఈ క్రమంలో అతణ్ని బైక్‌ ఢీకొంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

error: Content is protected !!