News December 30, 2024

HMDA పరిధిలో 3,532 చెరువులు

image

HMDA పరిధిలో మొత్తం 3,532 చెరువులు ఉండగా.. 3,498 చెరువుల సర్వే పూర్తయింది. ఇంకా 34 చెరువుల సర్వే జరగాల్సి ఉంది. ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రం 2,836 చెరువులకు మాత్రమే వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ఫైనల్ నోటిఫికేషన్ వేసిన చెరువుల సంఖ్య 464 ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల నాటి రికార్డులను పరిశీలిస్తున్నారు.

Similar News

News November 26, 2025

మున్సిపాల్టీల విలీనంతో HMDA ఆదాయానికి గండి

image

గ్రేటర్‌లో మున్సిపాల్టీల విలీనం తరువాత  HMDA ఆదాయం కోల్పోనుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి HMDAకు ఆదాయం అధికంగా వస్తోంది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాల్టీలో గ్రేటర్లో భాగం కానున్నాయి. అంటే.. హెచ్ఎండీఏ పరిధి కూడా తగ్గనుంది. ఈ క్రమంలో రాబడి కూడా తగ్గిపోతుంది. HMDAకు నెలనెలా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుండగా.. విలీనం అనంతరం రూ.20 కోట్లకు పడిపోతుందని సమాచారం.

News November 26, 2025

ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.

News November 26, 2025

HYD: LOVEలో ఫెయిల్.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి (26) స్నేహితులతో కలిసి సింగపూర్ టౌన్షిప్‌లో అద్దెకుంటూ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో పవన్ తన రూమ్‌లో ఉరేసుకున్నాడు. స్నేహితులు గమనించి PSకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.