News December 30, 2024

HMDA పరిధిలో 3,532 చెరువులు

image

HMDA పరిధిలో మొత్తం 3,532 చెరువులు ఉండగా.. 3,498 చెరువుల సర్వే పూర్తయింది. ఇంకా 34 చెరువుల సర్వే జరగాల్సి ఉంది. ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రం 2,836 చెరువులకు మాత్రమే వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ఫైనల్ నోటిఫికేషన్ వేసిన చెరువుల సంఖ్య 464 ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల నాటి రికార్డులను పరిశీలిస్తున్నారు.

Similar News

News January 2, 2025

HYD: MNJ ఆస్పత్రికి రోగుల తాకిడి

image

రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా సుమారు 1500 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, మరో 1200 వరకు గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారు సంప్రదిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువమంది వ్యాధి ముదిరే దశలో వస్తున్నారని, మొదటి దశలో వస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

News January 2, 2025

హైదరాబాద్‌లో 81 లక్షల చలాన్లు..!

image

HYD, CYB, RCK ట్రై కమిషనరేట్ల పరిధిలో 2024లో ట్రాఫిక్ చల్లాన్ల సంఖ్య 81,19,743గా నమోదయింది. ఇందులో వివిధ ఉల్లంఘనల్లో పెరుగుదల గుర్తించారు. మొబైల్ ఫోన్ డ్రైవింగ్ 34.54%, సిగ్నల్ జంపింగ్ 25.34%, మద్యం సేవించి డ్రైవింగ్ 18.53%, నో హెల్మెట్ డ్రైవింగ్ 17.88%, ట్రిపుల్ బైక్ రైడింగ్ 7.84% పెరిగాయని వార్షిక రిపోర్టులో వెళ్లడైంది.

News January 2, 2025

సికింద్రాబాద్: 2024లో 1,194 కిలోల గంజాయి పట్టివేత

image

2024లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పరిధిలో 1,194 కిలోల గంజా‌ను పట్టుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు(GRP) అధికారులు రూ.2.98 కోట్ల విలువైన గంజాయిగా గుర్తించారు. 38 కేసులలో 53 వ్యాపారులు అరెస్టయ్యారని SP చందన తెలిపారు. జీఆర్పీ పోలీస్ స్టేషన్ గంజాయి రవాణాపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది.