News October 26, 2025

HMDA పునర్వ్యవస్థీకరణ..జోనింగ్ పై FOCUS

image

HYD మహానగర అభివృద్ధి సంస్థ HMDA పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. నగర పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు RRR వరకు విస్తరించిన పరిధిలో ఘట్‌కేసర్, శంషాబాద్, శంకరపల్లి 1-2, మేడ్చల్ 1-2 జోన్లను విభజించి, ప్రతి జోన్‌లో ప్రత్యేక అధికారులు, సాంకేతిక సిబ్బందిని నియమించే అవకాశముంది. ముఖ్యంగా జోనింగ్ పై ఫోకస్ పెట్టింది.

Similar News

News October 26, 2025

కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

image

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 26, 2025

వనపర్తి: ఆర్టీసీ సేవలు వినియోగించుకోండి- DM

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వనపర్తి డిపో నుంచి ఈనెల 27, 28, 29వ తేదీల్లో 30 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈనెల 28న ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం రోజున వనపర్తి, కొత్తకోట నుంచి 20 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. కాబట్టి భక్తులు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకుని సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.

News October 26, 2025

రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA

image

AP: ‘మొంథా’ తుఫాను ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. SKL, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూ.గో., ఏలూరు, NTR, GNT, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.