News December 30, 2024

HMDA పరిధిలో 3,532 చెరువులు

image

HMDA పరిధిలో మొత్తం 3,532 చెరువులు ఉండగా.. 3,498 చెరువుల సర్వే పూర్తయింది. ఇంకా 34 చెరువుల సర్వే జరగాల్సి ఉంది. ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రం 2,836 చెరువులకు మాత్రమే వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ఫైనల్ నోటిఫికేషన్ వేసిన చెరువుల సంఖ్య 464 ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల నాటి రికార్డులను పరిశీలిస్తున్నారు.

Similar News

News January 4, 2025

HYD: మంత్రులను, డీజీపీని కలిసిన హైడ్రా కమిషనర్

image

HYDలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందర్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.

News January 4, 2025

HYDకు వచ్చే మంచినీరు ఈ నదుల నుంచే..!

image

నగరానికి ప్రస్తుతం మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని జలమండలి తెలిపింది. గోదావరి ఫేజ్-2 ద్వారా మరిన్ని నీటిని తరలించి ఉస్మాన్‌సాగ‌ర్‌, హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టు రూపు దిద్దుకుంటుందని పేర్కొంది. మరోవైపు జలమండలి నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఆదాయం పెంచడంపై దృష్టి సారించనుంది.

News January 4, 2025

HYDలో 13.79 లక్షల వాటర్ కనెక్షన్లు..!

image

ప్రస్తుతం HYD జనాభాకు సరిపడేలా తాగునీటి సరఫరా చేస్తున్నామని జలమండలి అధికారులు తెలిపారు. నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9,800 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో 13.79 లక్షల కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు సీఎం సమావేశంలో అధికారులు వివరించారు. పలు అంశాలపై ఏజెన్సీలు, కన్సల్టెన్సీ‌లతో అధ్యయనం జరిపించనున్నారు.