News January 13, 2025
చైనాలో hMPV కేసులు తగ్గుతున్నాయ్

చైనాలో hMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఇది చాలా దశాబ్దాలుగా ఉందని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని చైనా వైద్యాధికారులు తెలిపారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని వివరించారు. భారత్లో 17 hMPV కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
Similar News
News October 24, 2025
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News October 24, 2025
APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్లో 145 పోస్టులు

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/
News October 24, 2025
అఫ్గాన్ బార్డర్లు క్లోజ్.. పాక్లో కేజీ టమాటా రూ.600

ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్గాన్-పాక్ బార్డర్లు ఇటీవల మూసేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మందుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాక్లో టమాటాల ధరలు 5 రెట్లు పెరిగి కిలో 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతున్నాయి. యాపిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వ్యాపారం స్తంభించిపోయిందని, 2 దేశాలు రోజుకు $1M నష్టపోతున్నాయని అక్కడి వ్యాపార వర్గాలు తెలిపాయి.


