News January 7, 2025
బెంగళూరు కంటే ముందుగానే అక్కడ hMPV

దేశంలో బెంగళూరు కంటే ముందే మరో ప్రాంతంలో hMPV కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలోని షిమోగాలోని ప్రైవేటు ఆసుపత్రిలో 6 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే గత నవంబర్లోనే వీటిని గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన వారు 1-2 ఏళ్ల పిల్లలే కాగా ప్రస్తుతం వీరు కోలుకున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న, ఇవాళ దేశంలో 8 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Similar News
News January 28, 2026
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా..

విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ సుదీర్ఘ కాలం పాటు Dy.CMగా కొనసాగారు. పృథ్వీరాజ్ చవాన్(కాంగ్రెస్-NCP), దేవేంద్ర ఫడణవీస్(NDA-2 సార్లు), ఉద్ధవ్ ఠాక్రే(MVA), ఏక్నాథ్ షిండే(NDA) ప్రభుత్వాల్లో డిప్యూటీ CMగా పని చేశారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నుంచి 1991లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీటు నుంచి 7 సార్లు గెలిచారు.
News January 28, 2026
నిద్రలో శివుడు కనిపిస్తే..?

కలలో శివుడు కనిపించడం అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతోంది. శివుడికి సంబంధించి ఏ వస్తువు కనిపించినా కష్టాలు తీరుతాయని, త్వరలోనే శుభవార్తలు వింటారని అర్థం. శివలింగం కనిపిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గర్భవతులకు శివలింగం కనిపిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈశ్వరుడు కలలో రావడం భవిష్యత్తులో జరగబోయే శుభపరిణామాలకు సంకేతం.
News January 28, 2026
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. SSD టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 5 గంటలు పడుతోంది. క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,049 మంది దర్శించుకోగా, 21,469 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చింది. టోకెన్ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూలోకి రావాలని TTD సూచించింది.


