News January 6, 2025
HMPV వైరస్: స్టాక్ మార్కెట్లు క్రాష్

స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. బెంగళూరులో ప్రమాదకర HMPV వైరస్ కేసులు నమోదవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో తమవద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 78,000, నిఫ్టీ 320 పాయింట్లు పతనమై 23,680 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా రూ.5లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. ఇండియా విక్స్ నేడు 12.61% పెరగడం గమనార్హం. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
Similar News
News January 6, 2026
బంగాళాఖాతంలో అల్పపీడనం

AP: దక్షిణ, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని, 24గంటల్లో మరింత బలపడనుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి వర్షాలు పడే ఆస్కారముందని పేర్కొంది. మరోవైపు కోస్తా జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. మరో నాలుగు రోజులు అల్లూరి, ప.గో. నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా, మిగతా జిల్లాల్లో మోస్తరుగా మంచు కురుస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది.
News January 6, 2026
ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?

AP: రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇప్పటికే కొనసాగుతున్న 62ఏళ్లు పైబడిన 2,831మంది ఉద్యోగులపై దృష్టి సారించారు. వయోపరిమితి పెంపుతో పడే అదనపు భారాలపై వివరాలు సేకరించి మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
News January 6, 2026
RCFLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<


