News June 21, 2024

HNK: అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్లు జైలు

image

పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3000 జరిమాన విధిస్తూ హనుమకొండ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామానికి చెందిన ముత్యాల హనుమంతు 2017 సెప్టెంబర్ 13న దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఆడుకుంటుండగా ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News December 4, 2025

వరంగల్ జిల్లా తొలి విడత ఎన్నికల్లో 11 స్థానాలు ఏకగ్రీవం

image

మొదటి విడత స్థానిక ఎన్నికల్లో WGL జిల్లాలో 11 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రాయపర్తి మండలంలో 6, పర్వతగిరిలో 3, వర్ధన్నపేటలో 2 చోట్ల ఏకగ్రీవాలు నమోదయ్యాయి. పోతురెడ్డిపల్లి, కిష్టపురం సూర్యతండా, బాలునాయక్ తండాల్లో కాంగ్రెస్ నుండి సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్వతగిరిలో మోత్యతండా, సూపతండా, శ్రీనగర్‌లో కూడా ఏకగ్రీవం కాగా వర్ధన్నపేటలో రామోజీ కుమ్మరిగూడెం, చంద్రుతండా అయ్యాయి.

News December 4, 2025

వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.