News April 8, 2025
HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.
News November 15, 2025
తండ్రయిన రాజ్‌కుమార్

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.
News November 15, 2025
వయోవృద్ధులను గౌరవిద్దాం: WGL కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకథాన్(ర్యాలీ) జరిగింది. కలెక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 19 వరకు జిల్లాలో వారోత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.


