News April 23, 2025

HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్‌కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.

Similar News

News April 24, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి

image

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ జి.ఫనింద్రరెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి PACS, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వసతులపై ఆరా తీశారు. తక్షణ ట్యాబు ఎంట్రీ, 72 గంటల్లో చెల్లింపు, తేమ శాతం, FAQ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News April 24, 2025

అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: MLC కవిత

image

గోదావరిఖనిలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా MLC కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ‘శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని’ ఆమె ఆకాంక్షించారు.

News April 24, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 24, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.39 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.54 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!