News April 4, 2024

HNK: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై.. అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల కామారెడ్డికి చెందిన సతీశ్‌‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను కామారెడ్డికి రావాలని కోరగా.. రెండ్రోజుల కిందట వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News April 25, 2025

మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

image

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.

హన్మకొండ: భార్యా భర్తలు అదృశ్యం

image

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ కాలనీకి చెందిన భార్య భర్తలు సందీప్ కుమార్(44), మానస(40) 21 రోజుల క్రితం అదృశ్యం అయ్యారని కాజీపేట ఎస్సై నవీన్ తెలిపారు. వారి తండ్రి సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.

error: Content is protected !!