News February 12, 2026

HNK: ఈ పిల్లల్ని గుర్తిస్తే.. ఫోన్ చేయండి!

image

కిడ్నాపర్ల నుంచి పోలీసులు రక్షించిన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం వీరు శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్నారు. నిందితుల సమాచారం ప్రకారం.. వీరిని కాజీపేట, మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో అపహరించినట్లు తెలిసింది. ఎవరైనా ఈ ముగ్గురు పిల్లలను గుర్తిస్తే వెంటనే కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి (87126 85122)ని సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

Similar News

News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.

News March 14, 2026

నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

image

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News March 14, 2026

దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

image

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.