News September 4, 2024
HNK: ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం

దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఉపకార వేతనం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ వి.హనుమంతు తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.india-post.gov.in గల వెబ్సైట్లో పరిశీలించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 13లోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, హనుమకొండ చిరునామాలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News December 3, 2025
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిన చూడాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. అమిన్పేట క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అభ్యర్థుల రద్దీ, సమర్పణ ప్రక్రియను ఆమె సమగ్రంగా పరిశీలించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
News December 3, 2025
వంజరపల్లిలో సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ!

సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 1,4,6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఎస్టీ జనాభా లేని గ్రామానికి ఈ పదవులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి 5 వార్డులకు మాత్రమే నామినేషన్లు రావడంతో, ఉప సర్పంచ్గానే గ్రామ పాలన నడిచే పరిస్థితి.
News December 1, 2025
గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.


