News February 11, 2025

HNK: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హన్మకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

Similar News

News November 28, 2025

ఉంగుటూరు: సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

CM చంద్రబాబు డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మెన్ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి, SP కిషోర్‌తో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం గొల్లగూడెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసే ప్రాంతాన్ని పరిశీలించారు.

News November 28, 2025

నిజామాబాద్: విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చాయి

image

దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్‌లోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

News November 28, 2025

ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: NZB సీపీ

image

నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. జిల్లా పరిధిలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం అన్నారు.