News February 11, 2025

HNK: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హన్మకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

Similar News

News March 21, 2025

రేపే ఎర్త్ అవర్.. లైట్లు ఆపేద్దామా..?

image

ప్రతి ఏటా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ జరుపుతుంటారు. ఆ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో లైట్లను ఆపేస్తారు. పర్యావరణ పరిరక్షణకు, భూతలతాపాన్ని నియంత్రించేందుకు ఈరోజును ప్రారంభించారు. ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆపి ఈరోజును పాటించాలని AP గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కాగా.. ఢిల్లీ ప్రభుత్వం ఎర్త్ డేను పాటిస్తూ రేపు రాత్రి ఆ గంట సేపు లైట్లను ఆపేయనుంది.

News March 21, 2025

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ 

image

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, MGNREGS ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, పల్లె పండుగలో భాగంగా మొదలుపెట్టిన అభివృద్ధి పనుల స్థితిగతులపై, రేపు మొదలు పెట్టబోయే ఫాం పాండ్స్ పనులపై ఆరా తీశారు. ఈ కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ పాల్గొన్నారు. 

News March 21, 2025

చొప్పదండి: భారీ వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంట

image

చొప్పదండి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నియోజకవర్గంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!