News April 28, 2024

HNK: కాసేపట్లో కేసీఆర్ రోడ్‌షో.. అంతా సిద్ధం

image

హన్మకొండలో కాసేపట్లో మాజీ సీఎం కేసిఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్‌షోకు సంబంధించి స్థానిక నేతలు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోడ్ షోకు హాజరయ్యేందుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి.

Similar News

News November 13, 2024

హన్మకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ దిశా సమావేశం

image

హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ & పర్యవేక్షణ-దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, MLAలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థ, మహిళా రక్షణ, మున్సిపల్ అభివృద్ధి, శానిటేషన్, తాగునీరు తదితర అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు.

News November 13, 2024

వరంగల్: తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పతనమైంది. సోమవారం రూ. 6,960 పలికిన క్వింటా కొత్త పత్తి ధర, మంగళవారం రూ.7,000కి పెరిగింది. అయితే ఈరోజు ఎవరూ ఊహించని విధంగా దారుణంగా పతనమై రూ.6,860కి పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

News November 13, 2024

ఎనుమాముల మార్కెట్‌కు మూడు రోజుల సెలవు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 15న గురునానక్ జయంతి, 16న వారాంతపు సెలవు, 17 ఆదివారం సెలవు దినాలని మార్కెటింగ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 18న సోమవారం మార్కెట్ పునః ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.