News February 15, 2025

HNK: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

image

తెలియక ఓ చెట్టు పండ్లను తిన్న గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.HNK జిల్లా హసన్‌పర్తి జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం పలువురు విద్యార్థులు ఇదే గురుకులంలోని ఒక చెట్టు పండ్లను తిన్నారు. దీంతో ఆరుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Similar News

News February 26, 2026

HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

image

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్‌లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.

News February 26, 2026

KNR: పట్టు కోల్పోతున్న ‘హస్తం’.. ఉమ్మడి జిల్లాకు పాకుతుందా?

image

KNR జిల్లాలో పార్టీ పట్టు సడలడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జిల్లా నేతల తీరుపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. KNR అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావు నేతృత్వంలో పార్టీ ఓటమి పాలవ్వడంతో జిల్లా కేంద్రంలో పట్టు కోల్పోతే భవిష్యత్తులో ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడుతుందని స్థానికంగా చర్చ నడుస్తోంది.

News February 26, 2026

VKB: పరీక్షా కేంద్రాల వద్ద ఇవి బంద్

image

జిల్లాలో నేడు ఇంటర్ 2nd ఇయర్ పరీక్షకు 8,006 మంది విద్యార్థులు హాజరుకానునట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి తెలిపారు. గురువారం లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా సెంటర్ల వద్ద జిరాక్స్, ప్రింటింగ్‌ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు.