News March 12, 2025
HNK: గ్రూప్-1లో మెరిసిన సాయితేజ

TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన నయీంనగర్కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.
Similar News
News October 28, 2025
రేపు ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు. తుఫాను తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

బాపట్ల జిల్లాలో తుపాన్ ప్రభావం నేపథ్యంలో విద్యుత్, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుపాన్ వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు సూచనల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. వాగుల వద్ద ప్రజలు రోడ్లు దాటకుండా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News October 28, 2025
పెద్దపల్లి: ‘100% ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ చేయాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని 100% ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కింగ్ చేసిన ఇండ్లు కనీసం బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని, లబ్ధిదారులకు రుణ సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా సహాయం అందించాలని సూచించారు. నిర్మాణంలో ఆలస్యం చేసినవారి ఇండ్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. పనులను పర్యవేక్షించి, బిల్లుల చెల్లింపులు సమయానికి చేయాలని ఆదేశించారు.


