News March 12, 2025
HNK: గ్రూప్-1లో మెరిసిన సాయితేజ

TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్‌లో నయీంనగర్‌కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.
Similar News
News March 21, 2025
వరంగల్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

వరంగల్ రైల్వే స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్‌లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.
News March 21, 2025
రాష్ట్రస్థాయి మేళాపై కలెక్టర్ సమన్వయ సన్నాహక సమావేశం

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల రాష్ట్ర స్థాయి మేళాపై కలెక్టర్ సత్య శారద వివిధ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సన్నహక సమావేశం నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర స్థాయి మేళ జిల్లాలో మార్చి 25 నుంచి 27 వరకు నిర్వహించినట్లు తెలిపారు. మేళాలో రైతు ఉత్పత్తి దారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖలు ఎలా సమన్వయంతో పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.
News March 21, 2025
స్వచ్ఛ సర్వేక్షన్ 20 24 ఫీడ్బ్యాక్‌పై అవగాహన: అశ్విని తానాజీ

స్వచ్ఛ సర్వేక్షన్ 2024 ఫీడ్ బ్యాక్ అందించేలా అవగాహన కల్పించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులను ఆదేశించారు. మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి తగు సూచనలు చేశారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ నగరానికి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రజలను భాగస్వాములను చేసి సమాచారం అందజేయడం వల్ల మంచి స్కోర్ వస్తుందని అన్నారు.