News March 30, 2025
HNK: జిల్లా ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలిపన కలెక్టర్

జిల్లా కలెక్టర్ పి.ప్రవీణ్య జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జిల్లా ప్రజలందరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలన్నారు. ప్రజల జీవితాల్లో విజయాలు, సంపదలు, సంతృప్తి సమృద్ధిగా సమకూరాలని, యువత కొత్త ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని, జిల్లా ప్రజలందరికీ కొత్త వెలుగు నింపాలని కోరారు.
Similar News
News January 5, 2026
ఏంటీ ‘ట్రంపరితనం’.. కొత్త యుద్ధాలు తప్పవా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ అరెస్టు చేయడం, <<18765231>>గ్రీన్‌ల్యాండ్‌పైనా<<>> కన్నేయడం భయాందోళనలకు దారితీస్తోంది. తాను 8 యుద్ధాలను ఆపానని, శాంతిదూతనని గొప్పలు చెప్పుకునే ట్రంప్ తెంపరి చేష్టలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు చిన్న దేశాల మనుగడకు ప్రమాదకరమని, చైనా, రష్యా, ఉ.కొరియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మరింత విజృంభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 2026లోనూ కొత్త యుద్ధాలకు ఆస్కారం ఉందంటున్నారు.
News January 5, 2026
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News January 5, 2026
NGKL: నేటి ప్రజావాణి 31 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, చట్టపరంగా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.


