News March 15, 2025
HNK: నేటి నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.
Similar News
News October 24, 2025
నేడు, రేపు భారీ వర్షాలు!

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, NGKL, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారితే.. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సున్నట్లు పేర్కొంది.
News October 24, 2025
జగిత్యాల: మరో ఐదు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే అనంతలోకాలకు..!

మరో 5 రోజుల్లో పెండ్లి ఉండగా పత్రికలు పంచేందుకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి కొడుకు అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన పెళ్లింట విషాదం నెలకొంది. జగిత్యాల మండలం సోమన్ పెళ్లికి చెందిన చెట్ల వంశీకి పెళ్లి నిశ్చయం కాగా, ఈనెల 30న పెళ్లి పెట్టుకున్నారు. ప్రమాదంలో పెళ్ళికొడుకు వంశీ మృతి చెందడం పెళ్ళంట విషాదం నింపింది.
News October 24, 2025
రేపు పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే.


