News March 15, 2025
HNK: నేటి నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.
Similar News
News April 17, 2025
నిడదవోలు: ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిడదవోలు డిపో నుంచి హైదరాబాద్‌కి RTC నూతన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. చాగల్లు- పంగిడి -దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- ఖమ్మం మార్గంలో ఈ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. రేపు సాయంత్రం 4:30 నిమిషాలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు నిడదవోలు ప్రాంత ప్రజలు సర్వీస్‌ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
News April 17, 2025
వినియోగదారులు సంస్థకు సహకరించాలి: ఎస్ఈ

వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ సుదర్శనం తెలిపారు. గురువారం మామడ మండలం తాండ్ర సబ్ స్టేషన్‌లో రెండు ప్రత్యేక బ్రేకర్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు. డీఈ నాగరాజు, ఏఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
News April 17, 2025
రూ.10.75 కోట్ల ప్లేయర్.. బెంచ్‌కే పరిమితం

IPL: గత ఐదేళ్లు SRHకు కీలక బౌలర్‌గా ఉన్న నటరాజన్‌ను ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఆక్షన్‌లో DC రూ.10.75 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసినా బెంచ్‌కే పరిమితం చేస్తోంది. గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నటరాజన్ గత సీజన్‌లోనూ 19 వికెట్లతో సత్తాచాటారు.