News January 31, 2025

HNK: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

image

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 2,834 మంది విద్యార్థులను గాను రూ.16,15,380 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Similar News

News December 8, 2025

KMR: స్థానిక పోరులో కొత్త ట్రెండ్

image

కామారెడ్డి జిల్లాలో సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎన్నో ఏండ్లుగా తగాదాల కారణంగా దూరమైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్తున్నారు. పాత విభేదాలు, ఘర్షణలను పక్కన పెట్టి, ‘క్షమించండి’ అంటూ చేతులు జోడిస్తున్నారు. ఈ భావోద్వేగపూరిత ప్రచారం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

News December 8, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల,డివిజన్ కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా,ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చున్నారు.