News March 3, 2025

HNK: పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఇంటర్ ప్రశ్నాపత్రాలు

image

మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ పరీక్షల ప్రశ్నపత్రాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ ప్రశ్న పత్రాలను అధికారులు పోలీస్ స్టేషన్‌ల్లో భద్రపరచడంతో పాటు సాయుధ పోలీసులు నిరంతరం పహార కాస్తారని అధికారులు తెలిపారు. పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాలకు చెందిన ఇన్విజిలేటర్లు పరీక్షా పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.

Similar News

News February 25, 2026

హనుమకొండలో కాంగ్రెస్ కార్పొరేటర్ అరెస్టు

image

హనుమకొండ 5వ డివిజన్‌ కాంగ్రెస్ కార్పొరేటర్‌ పోతుల శ్రీమన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయమై ఒకరిపై హత్యాయత్నం కేసులో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ పోలీసులు శ్రీమన్‌ను ఇంటివద్దే అదుపులోకి తీసుకున్నారు.

News February 25, 2026

మాఫియాలను ఏలి ప్రభుత్వాలను పరిగెత్తించారు.. కానీ!

image

మెక్సికన్ డ్రగ్ కార్టెల్‌కు బాస్, ₹130కోట్ల రివార్డ్ ఉన్న ‘ఎల్ మెంచో’ <<19224610>>గర్ల్‌ఫ్రెండ్<<>> వల్ల దొరికి హతమయ్యాడు. లాటిన్ అమెరికా అండర్‌వరల్డ్ చరిత్రకు ఇది కొత్తేం కాదు. 2025లో లూయిస్ పికాడో భార్య చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో చిక్కాడు. 2022లో భార్య ఫేస్‌బుక్‌లో సెల్ఫీ పోస్ట్ చేయడం ఎల్ పిట్‌ కొంపముంచింది. ఇలా పెద్ద మాఫియాలను నడిపి ప్రభుత్వాలకు ఏళ్లుగా దొరకని వాళ్లు ప్రియురాళ్ల లింక్‌తో దొరికిపోతున్నారు.

News February 25, 2026

కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఆదిలాబాద్ MLA

image

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.