News January 28, 2025
HNK: ప్రకృతి ప్రతిబింబానికి నేల నిలువుటద్దం..!

పచ్చని చెట్లు, పంటపొలాలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. పల్లెల్లో అలాంటి అందాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. HNK జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ సమీపంలో సాయంకాల వేళ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పొలాల్లో ఉన్న తాటిచెట్ల ప్రతిబింబం ప్రకృతికి నిలువుటద్దమైంది. ఈ దృశ్యం స్థానికులను ఎంతో ఆకట్టుకుంది.
Similar News
News February 19, 2025
రేపటి నుంచి కేయూ దూర విద్య సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలోని దూర విద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎంఏ జర్నలిజం, హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
News February 19, 2025
NLG: ఇందిరమ్మ ఇండ్లు సరే.. ఇసుకెట్ల..!?

రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే లబ్థిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.