News April 28, 2024

HNK: ప్రేమించిన అమ్మాయికి పెళ్లి నిశ్చయం.. యువకుడి ఆత్మహత్య

image

గూడురు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన రాజన్న (25) హసన్‌పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. రెండేళ్లుగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని మరో అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుందని తీవ్ర మనస్తాపానికి గురైన అతడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు శనివారం కేయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

Similar News

News December 5, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

image

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

News December 4, 2025

వరంగల్: రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్

image

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్‌లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్ జరిపారు.