News January 29, 2025

HNK: బాలుడి గొంతు కోసిన బాలిక తండ్రి (UPDATE)

image

HNKలో ఓ బాలుడిపై బాలిక(17) తండ్రి దాడి చేసి గొంతు కోయగా.. బాలిక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న బాలిక WGLకు చెందిన ఓ బాలుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని అతడిని ఇంటికి పిలిచింది. అప్పుడే బాలిక తండ్రి ఇంటికి రాగా.. కూతురితో సన్నిహితంగా ఉన్న బాలుడి గొంతు కోశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఉరేసుకుంది. బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 8, 2025

ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

image

* డెంటల్ ప్రాబ్లమ్స్ లేదా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్య అనిపించేలా దవడ నొప్పి
* పుల్లటి త్రేన్పులు, తరచూ వికారంగా ఉండడం, వాంతులు.
* అజీర్ణ సమస్యలు. ఫుడ్ పాయిజన్ కారణమనే భావన.
* హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గులు.
* వెన్నెముక పైన, భుజం బ్లేడ్‌ల మధ్యలో, బ్రెస్ట్ కింది భాగంలో నొప్పి.
* శారీరక శ్రమ లేకున్నా చెమటలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
* ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

News December 8, 2025

డెలివరీ తర్వాత జరిగే హార్మోన్ల మార్పులివే..!

image

ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. డెలివరీ అయిన వెంటనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉండటంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటివి జరుగుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ వంటివి కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.