News March 14, 2025

HNK: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

హనుమకొండలోని ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

Similar News

News March 15, 2025

KMR: ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గణితం 2బీ, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 5483 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 99 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1284 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 1246 మంది పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

News March 15, 2025

పెద్దపల్లి: నేడు 209 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. గణితం B, జీవ శాస్త్రం, చరిత్ర పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 3895 విద్యార్థులకు గాను 3647 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 248 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 209 మంది, వొకేషనల్ 39మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.

News March 15, 2025

భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

image

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.

error: Content is protected !!