News February 24, 2025

HNK: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News February 24, 2025

పారదర్శకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు: కలెక్టర్

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీవోలు శిక్షణ తరగతులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 27న చేపట్టే పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆకళింపు చేసుకొని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

News February 24, 2025

గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

image

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్చరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.

News February 24, 2025

జిల్లాలో 144వ సెక్షన్ అమలు: భూపాలపల్లి కలెక్టర్

image

ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు.

error: Content is protected !!