News March 2, 2025
HNK: మానవ అక్రమ రవాణాపై అవగాహన

మానవ అక్రమ రవాణాపై వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ బిగ్ బజార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. చిన్నారులతో ఎలాంటి పనులు చేయించుకోవద్దన్నారు. నవజాత శిశువులను అక్రమంగా దత్తత తీసుకోవడం నేరమని ఏహెచ్‌టీయూ ఎస్ఐ ఫిలిప్ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.
News December 1, 2025
ములుగు: పంతాలు, పట్టింపులు లేవు.. అన్నీ పంపకాలే..!?

ఉప్పు నిప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు పల్లెపోరులో పంతం వదులుతున్నాయి. నిన్నటి దాకా ఎదురుపడితే బుసలు కొట్టుకున్న నాయకులు సంధి రాజకీయాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డులను మీకిన్ని.. మాకిన్ని.. అంటూ పంచుకుంటున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన పంచాయతీల్లో ఈ పంపకాలు జోరందుకున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా నేతలు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ లోపు కొలిక్కి తెచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు.
News December 1, 2025
జగిత్యాల: బుజ్జగింపులు.. బేరసారాలు

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసి నేటి నుంచి 3 రోజులు విత్‌డ్రాకు గడువు ఉండడంతో అభ్యర్థులు బుజ్జగింపులు, బేరసారాలకు దిగుతున్నారు. తనకు మద్దతుగా విత్ డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులు తనకు పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తూ బేరసారాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.


