News May 11, 2024
HNK: మిర్చి బజ్జీలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య

హనుమకొండ చౌరస్తాలోని ఓ మిర్చి బండి వద్ద కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య మిర్చి బజ్జీలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు కాజీపేట నుంచి చౌరస్తా వరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమని కావ్య అన్నారు.
Similar News
News March 13, 2026
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

SIR మ్యాపింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (RDO)ను కలెక్టర్ ఆదేశించారు.
News March 13, 2026
బ్లాక్‌లో గ్యాస్ అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్ సత్య శారద

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 13, 2026
జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ పథకాల అమలుకు, దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన-2027పై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పులకు తావులేకుండా పారదర్శకమైన డేటాను సేకరించాలని సూచించారు.


