News January 26, 2025
HNK: లోపల పిల్లలు.. బయట తల్లిదండ్రులు!

హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద దేశ భక్తి వెల్లివిరిసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు తమ పిల్లలను పాఠశాలలోనికి పంపించిన తల్లిదండ్రులు.. అదే పాఠశాల గేటు ముందు జెండా వందనం చేశారు. ఇది చూసి అక్కడున్న వారు దేశ భక్తిపై హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 18, 2025
పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

టాలీవుడ్లో క్రేజీ కాంబో సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్‌తో మూవీ లాక్ చేసుకుంది. ఆ అవకాశం తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాలీవుడ్లో టాక్ స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ హెచ్.వినోద్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు.
News October 18, 2025
NZB: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

NZB జిల్లాలో మద్యం టెండర్లకు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 102 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 1419 దరఖాస్తుల స్వీకరించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో 492, బోధన్ 299, ఆర్మూర్ 260, భీమ్‌గల్ 171 దరఖాస్తులు వచ్చాయన్నారు. శనివారంతో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. చివరి రోజు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
News October 18, 2025
నర్వ: నీటి సంపులో పడి చిన్నారి మృతి

నర్వ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 18 నెలల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. శివరాం, పావనిల కూతురు రాజేశ్వరి (18 నెలలు)ని నానమ్మ పక్కన కూర్చోబెట్టి గడ్డి తొలగిస్తుండగా, ఇంటి పక్కన ఉన్న సంపులో రాజేశ్వరి పడింది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించకపోవటంతో వెతికారు. సుమారు గంట తర్వాత సంపులో చిన్నారి మృతిచెంది కనిపించటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.