News February 3, 2025

HNK: వసంత పంచమి.. పోలీస్ బందోబస్తు

image

వసత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరం ప్రధాన దేవాలయాలతో పాటు అమ్మవార్ల దేవాలయాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భద్రకాళి దేవస్థానంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని మహిళా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు దేవాలయ పరిసరాల్లో ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని సీపీ ఆదేశించారు.

Similar News

News January 18, 2026

జగిత్యాల: తల్లిదండ్రులను పోషించని కుమారులకు కౌన్సిలింగ్

image

కన్న తల్లిదండ్రులను పోషించని కుమారులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం జగిత్యాల, మల్యాల, ధర్మపురి మండలాలకు చెందిన కుమారులకు పిలిపించి అవగాహన కల్పించారు. వారు తల్లిదండ్రులను పోషిస్తామని అంగీకరిస్తూ ఒప్పంద పత్రాలు సమర్పించారు. జిల్లా కార్యదర్శి విశ్వనాథ్, హన్మంత రెడ్డి ఉన్నారు.

News January 18, 2026

విశాఖ జిల్లా ఆర్టీసీ ఆదాయం రూ.కోటి ఇరువై లక్షలు

image

సంక్రాంతి పండుగలు ముగించుకొని విశాఖ నుంచి తిరిగి వెళుతున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్‌లో రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసుల సంఖ్య పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాకు ఆర్టీసీ ద్వారా రూ. కోటి ఇరువై లక్షలు ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

News January 18, 2026

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.