News March 19, 2024
HNK: వివాహం చేసుకుంటానని మోసం.. వ్యక్తి పై కేసు

వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి సోమవారం HNK పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేరవుతున్నానని రూ.5 లక్షలను డిజిటల్ పేమెంట్ ద్వారా తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని బెదిరిస్తుండటంతో యువతి ఫిర్యాదు మేరకు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
Similar News
News February 8, 2026
వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
News February 7, 2026
వరంగల్: ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, ఏపీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.
News February 7, 2026
వరంగల్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో కొత్త వాటి కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నిబంధనల మేరకు పకడ్బందీగా అక్రిడిటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.


