News August 1, 2024
HNK: విషాదం.. డెంగ్యూతో నిండు గర్భిణి మృతి
డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన HNK జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గట్లకానిపర్తికి చెందిన శిరీష 9 నెలల గర్భవతి. శిరీషకు డెంగ్యూ జ్వరం రావడంతో 3 రోజుల క్రితం HNKలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న కవల శిశువులను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది. తల్లి, బిడ్డలు మృతి చెందారు.
Similar News
News November 28, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.
News November 28, 2024
దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.
News November 27, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు పరిశీలించారు.