News August 16, 2024
HNK: శ్రావణమాసంలో భారీగా పెరిగిన పూల ధరలు
శ్రావణ మాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతాల కారణంగా హనుమకొండలో పూల ధరలు మూడింతలు పెరిగాయి. దీనికి వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమూ ప్రభావం చూపుతోంది. గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550లు ఉండగా ఇప్పుడు రూ.1,500 పలుకుతోంది. తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, పసుపు చామంతి రూ.150 నుంచి రూ.400, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, లిల్లీ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1,200కు చేరాయి.
Similar News
News September 18, 2024
దేవదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష
ప్రముఖ ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News September 18, 2024
వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,700 పలకగా, సూక పల్లికాయ (పచ్చిది) రూ. 6,300, పచ్చి పల్లికాయ రూ.4,350 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు కూడా రూ.13,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పసుపు రాలేదని పేర్కొన్నారు.
News September 18, 2024
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహేశ్ కుమార్ గౌడ్
వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొన్నారు.