News December 26, 2024
HNK: సిద్దేశ్వరునికి అన్నాభిషేకం
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం గురువారం ఏకాదశి సందర్భంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం, చెరుకుతో మహనివేదన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
Similar News
News December 28, 2024
వరంగల్: వేర్వేరు కారణాలతో ఆరుగురి సూసైడ్
ఉమ్మడి WGL జిల్లాలో వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. భార్య విడాకులు ఇచ్చిందని గీసుగొండకు చెందిన శ్రీనివాస్, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని యాదగిరి పురుగు మందు తాగారు. కాశీబుగ్గకు చెందిన రాజేశ్ పెళ్లి కావడం లేదని ఇంట్లో ఉరేసుకోగా.. కాజీపేట సమీపంలో ఓ వ్యక్తి రైలుకింద పడగా.. నెక్కొండ వాసి వీరన్న మద్యానికి బానిసై.. రాయపర్తి వాసి రాజిరెడ్డి అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్నారు.
News December 28, 2024
వరంగల్: పెద్ద పులుల సంచారంపై భయం భయం..!
వరంగల్ జిల్లాలో <<14996095>>పెద్ద పులుల సంచారం<<>>పై అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పెద్దపులి అడుగుజాడ కనిపించడంతో అటవీ అధికారులు పరిశీలించారు. 2 పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నల్లబెల్లికి సరిహద్దులుగా ఉన్న దుగ్గొండి, ఖానాపురం, నర్సంపేట మండలాల్లోని గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News December 28, 2024
నల్లబెల్లి: అడుగులే పులుల సంచారాన్ని బయటపెట్టాయి!
పులుల అడుగుల సైజులతోనే మండలంలో మూడు పులులు సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా మగ పులి అడుగు పెద్దగా, ఆడపులి అడుగు కొద్దిగా చిన్నగా ఉంటుందని అధికారులు తెలిపారు. రుద్రగూడెంలో పులి అడుగు సైజు 15 నుంచి 20 సెం.మీ కాగా కొండాపురంలో పులి అడుగు 12 నుంచి 15 సెం.మీ, పులి పిల్ల అడుగు 6 నుంచి 8 సెం.మీ ఉండడంతో మండలంలో ఒకటి కాదు మూడు పులుల సంచారం బయటపడింది.