News November 15, 2024
HNK: అంబులెన్సులో ప్రసవం.. సీపీఆర్ చేసి బిడ్డను కాపాడిన సిబ్బంది
ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే ప్రసవించగా.. 108 సిబ్బంది సీపీఆర్ చేసి చలనం లేని బిడ్డను కాపాడారు. HNK జిల్లా వేలేరు మండలం లోక్యా తండాకు చెందిన భూక్య అఖిల ఆరు నెలల గర్భిణి. ఆమెకు గురువారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అఖిల.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువులో చలనం లేకపోవడంతో 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. తల్లీబిడ్డలను ఆస్పత్రిలో చేర్పించారు.
Similar News
News November 15, 2024
నేడు పాలకుర్తిలో అఖండజ్యోతి
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించే అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి ఆలయ గుట్టపై 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యశస్వని రెడ్డి హాజరుకానున్నారు.
News November 15, 2024
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై చర్యలు: కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో చట్టం అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇప్పటి వరకు నమోదైన కేసులు, జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిని గురించి సమీక్షించారు. లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News November 14, 2024
హనుమకొండ: శివయ్య శిరస్సుపై జాబిల్లి
హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు లింగం శ్రీ సిద్దేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. సాయంకాలం సంధ్యా సమయంలో కార్తీక పౌర్ణమి ఘడియల్లో శివయ్య శిరస్సుపై జాబిల్లి విరజిల్లుతున్నట్లు కనిపించింది. పలువురు భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.