News April 8, 2025

HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 17, 2025

సూపర్ ఓవర్.. DC టార్గెట్ ఎంతంటే?

image

IPL-2025: ఈ ఏడాది జరిగిన తొలి సూపర్ ఓవర్‌లో RR 11 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, జైస్వాల్ రనౌట్ అయ్యారు. 20వ ఓవర్ అద్భుతంగా వేసి మ్యాచ్‌ను టై చేసిన స్టార్క్ సూపర్ ఓవర్లో బౌలింగ్ చేశారు. DC లక్ష్యం 12 పరుగులు. హెట్‌మెయర్ 5, పరాగ్ 4 రన్స్ చేయగా.. ఎక్స్‌ట్రాల ద్వారా 2 పరుగులు వచ్చాయి.

News April 17, 2025

IPL: మ్యాచ్ టై.. తొలి సూపర్ ఓవర్

image

DCvsRR మ్యాచ్‌ టైగా ముగిసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి 8 పరుగులే ఇచ్చారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. RR టాప్ ఆర్డర్ శాంసన్, జైస్వాల్, నితీశ్ రాణా రాణించినా ఆ జట్టు గెలవలేకపోయింది. కాసేపట్లో ఈ సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ జరగనుంది.

News April 17, 2025

జాట్ సినిమాపై క్రైస్తవుల ఆందోళన

image

సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన జాట్ సినిమాపై పంజాబ్‌లో క్రైస్తవుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో క్రిస్టియన్స్ మతవిశ్వాసాలను కించపరిచే సన్నివేశాలున్నాయని, మూవీని బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ సన్నివేశాల్ని 48గంటల్లో తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు.

error: Content is protected !!