News February 23, 2026

HNK: ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ డిగ్రీ ఫలితాలు విడుదల

image

సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్‌సీ కోర్సుల ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి ప్రకటించారు. ఈ పరీక్షల్లో 33.35 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆమె వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు పునఃపరిశీలన లేదా అనుబంధ పరీక్షల కోసం మార్చి 9వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 26, 2026

ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

News February 26, 2026

గాలివీడులో హత్య కేసు.. ఐదుగురు అరెస్ట్

image

గాలివీడు మండలంలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిందితులు అంగీకరించారు. రూ.4 లక్షల నగదు (మొదటి ముద్దాయి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన సుపారీ), 7 సెల్ ఫోన్లు, 2 కత్తులు, ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ కృష్ణమోహన్, CI, SIని ఎస్పీ ధీరజ్ అభినందించారు.

News February 26, 2026

సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

image

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.