News March 13, 2025
HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 13, 2025
దోమ: ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కు తరలింపు

దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొడుగోనిపల్లి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫారం దగ్గర మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, ధన్ రాజ్ అనే వ్యక్తులు బైక్‌తో ట్రాక్టర్‌కు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడి నుంచి వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
News March 13, 2025
తాండూర్: రూ.1.30లక్షల తాకట్టు నగదు చోరీ!

తాండూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.1.30 లక్షల లోన్ తీసుకున్నారు. తదనంతరం మళ్లీ కారులో బయలుదేరారు. కొద్ది దూరంలో టైర్ పంచర్ కావడంతో శారద భర్త రాజు కారు టైర్ పంచర్ చేయించడానికి తీసుకెళ్లాడు. ఇదంతా గమనించిన ఓ దుండగుడు భార్య శారదకు మాయమాటలు చెప్పి కారులో నుంచి దించి డబ్బుల బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 13, 2025
ఖమ్మం: MSG ఓపెన్ చేస్తే రూ.మూడున్నర లక్షలు మాయం

సైబర్ మోసగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.3.50 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుసులూరి ఉపేందర్ చౌదరి వరి కోత మెషీన్ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 2 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా పీఎం కిసాన్ యాప్ అని మెసేజ్ రాగా, దానిని ఓపెన్ చేయడంతో మంగళవారం రూ.3.50 లక్షలు అకౌంట్ నుంచి బదిలీ అయ్యాయని బాధితుడు వాపోయాడు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.