News October 14, 2025
HNK: కటాక్షాపూర్ కాజ్‌వే నిర్మాణానికి రూ. 15లక్షల మంజూరు: కలెక్టర్

వరంగల్ -ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్‌వే నిర్మాణాన్ని రూ.15లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కటాక్షపూర్ కాజ్‌వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఈ కిరణ్ పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
‘ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపుల విక్రయాలు అరికట్టండి’

ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమై కలెక్టర్ చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలన్నారు.
News October 14, 2025
రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్‌లు, CII ప్రతినిధులు, ఎక్స్‌పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
News October 14, 2025
పెన్షనర్ల కోసం ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్’ క్యాంపైన్

పెన్షనర్ల కోసం కేంద్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1-30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహా పెన్షనర్లకు నగదు అందించే 19 బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. 1.8 లక్షల పోస్ట్ మ్యాన్/గ్రామీణ డాక్ సేవక్‌లు ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్లి DLC జెనరేట్ చేస్తారు. సాధారణంగా పెన్షన్ కోసం ఏటా పెన్షనర్లే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.