News October 12, 2025
HNK కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం

హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్‌లో ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 12, 2025
డాక్టర్ కావాలని ఆశను కూటమి ప్రభుత్వం చిదిమేస్తోంది: రంగయ్య

డాక్టర్ కావాలనే పేద, సామాన్య, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను కూటమి ప్రభుత్వం చిదిమేస్తోందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడగట్టలో ఆదివారం వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. తలారి రంగయ్య సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్రను ప్రజలకు తెలియజేయాలని కోటి సంతకాల కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.
News October 12, 2025
జనగామ: ప్రజావాణి నిర్వహణపై స్పష్టత కరవు!

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు వాయిదా వేయడంతో ఎన్నికల సంఘం కోడ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు ఉన్నట్లా? లేనట్లా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
News October 12, 2025
మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం: డీపీఈవో

జనగామ జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి అనిత తెలిపారు. ST సామాజిక వర్గానికి 1 కేటాయించగా, SC సామాజిక వర్గానికి 5, గౌడ సామాజిక వర్గానికి 13 కేటాయించగా, 31 జనరల్ కేటగిరి కింద ఉన్నాయన్నారు. ఆసక్తిగల దరఖాస్తుదారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని కోరారు.