News March 24, 2025
HNK: గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.
Similar News
News March 26, 2025
వరంగల్: అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరాకు టెండర్

వరంగల్ జిల్లాలోని 670 అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి తెలిపారు. నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు 2025 ఏప్రిల్ నుంచి మార్చి 2026 సంవత్సరం వరకు సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈనెల 28లోగా దరఖాస్తులు అందచేయాలని మరిన్ని వివరాల కోసం జిల్లా సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News March 26, 2025
వరంగల్: బస్టాండ్ నిర్మాణ పనుల్లో బాంబుల వినియోగం

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఆనధారితంగా బస్టాండ్ నిర్మాణం పనుల్లో బాంబులు ఉపయోగిస్తున్నారని ప్రజలు తెలిపారు. పునాది పనుల్లో బాంబు పేలడంతో భూపాలపల్లి డిపో బస్సు అద్దాలు పగిలినట్లు ప్రజలు తెలిపారు. ప్రయాణికులు తప్పిన పెనుముప్పు. పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
News March 25, 2025
WGL: మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..

ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి నిన్న రూ.10,500 ధర పలకగా.. నేడు రూ.10,800 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్న రూ.26,500 ధర రాగా..నేడు రూ.28వేలు వచ్చింది. సింగిల్ పట్టికి రూ.27వేలు (నిన్న 26వేలు), దీపిక మిర్చి రూ.13,300(నిన్న రూ.22,500) ధర ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2265(నేడు రూ.2250) పలికిందన్నారు.