News December 28, 2025

HNK: ఛార్జీల వసూళ్లపై TGNPDCL ప్రత్యేక దృష్టి!

image

వ్యవసాయ సర్వీసుల కస్టమర్ ఛార్జీల వసూళ్లపై TGNPDCL ప్రత్యేక దృష్టి సారించింది. ఉచిత విద్యుత్ ఉన్నా ప్రతి వ్యవసాయ సర్వీసుకు ఏటా రూ.300 కస్టమర్ ఛార్జీలను డిసెంబర్లో వసూలు చేస్తోంది. సంస్థ పరిధిలో 13,84,128 సర్వీసులకు రూ.119.56 కోట్ల బకాయిలు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,02,062 సర్వీసులకు రూ.37.26 కోట్ల బకాయిలు ఉన్నాయి. వసూళ్లలో భాగంగా కొన్ని చోట్ల విద్యుత్ కోతపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు.

Similar News

News December 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 30, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:16 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:09 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 30, 2025

సంగారెడ్డి: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. జైలు శిక్ష

image

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భవాని చంద్ర తీర్పు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లికి చెందిన సుశీల వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు కుమార్‌తో కలిసి భర్త నరసింహులను 2015 సెప్టెంబర్ 15న మెడకు తాడును గట్టిగా బిగించి హత్య చేశారు. కేసులో ఏ-1గా ఉన్న సుశీలకు ఇప్పటికే జీవిత ఖైదు పడింది. మరో నిందితుడు కుమార్‌కు కూడా సోమవారం జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

News December 30, 2025

సంగారెడ్డి: వాటర్ ట్యాంక్‌లో బాలుడు పడి మృతి

image

వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతిచెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.