News March 13, 2025
HNK: జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ పదో తరగతి వార్షిక పరీక్షలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నేడు హనుమకొండ హంటర్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల(ధర్మసాగర్)ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాస్తున్నారు, నీట్, ఎంసెట్‌లకు దరఖాస్తు చేశారా అని కలెక్టర్ జూనియర్ కళాశాల విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 13, 2025
రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
News March 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: అగ్ని వీర్‌కు దరఖాస్తు చేసుకోండి

అగ్ని వీర్ నియామకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పేర్కొన్నారు. వివిధ కేటగిరీల అగ్ని వీర్ నియామకం కోసం ఏప్రిల్ 10వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మొట్టమొదటిసారిగా తెలుగుతోపాటు 13 వేర్వేరు భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News March 13, 2025
BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.